విభిన్నంగా ఉండబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ !

విభిన్నంగా ఉండబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ !

Published on May 12, 2020 1:10 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని.. ముఖ్యంగా నాని క్యారెక్టర్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని సినిమా పూర్తిగా కొత్తగా ఉండబోతుందట.

అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ అండ్ మిగిలిన నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు