కోతి కొమ్మచ్చి.. పొరపాటు ప్రేమ కథ అట !

కోతి కొమ్మచ్చి.. పొరపాటు ప్రేమ కథ అట !

Published on Nov 23, 2020 10:04 AM IST

వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న హీరోలుగా తెరకెక్కుతున్న కోతి కొమ్మచ్చి చిత్రీకరణ ప్రస్తుతం విశాఖలో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతోందని.. సినిమాలో సిచ్యుయేషన్ కామెడీ బాగా వర్కౌట్ అవుతుందని.. ఇద్దరు హీరోలు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకమ్మాయితోనే ప్రేమలో పడటం.. ఆ అమ్మాయికి కూడా తెలియకుండా ఇద్దర్ని లవ్ చేయడం.. ఈ పొరపాటు ప్రేమలో చివరకు ఏమి జరిగిందో చూడాలి. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా పూర్తి భిన్నంగా ఉంటుందట.

కాగా ఇటీవల అమలాపురంలో కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌ సాంగ్స్‌ పూర్తి చేశారు. విశాఖలో హీరోలతో పాటు హీరోయిన్లు రిద్ది కుమార్‌, మేఘా చౌదరిపై సన్నివేశాలు తీస్తున్నారు. ఒక పాట మినహా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేయబోతున్నారట. ఇక ఈ చిత్ర నిర్మాత ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా క్వాలిటీ అవుట్ ఫుట్ తో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్నలకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

తాజా వార్తలు