కపిల్ జీవిత చరిత్ర “83”కు తుది మెరుగులు..!

మన ఇండియన్ సినీ హిస్టరీలో బయో పిక్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కేటగిరీ ఏదైనా సరే ఆయా రంగాల్లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన వారి జీవిత చరిత్రను చూసేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తారు.అలాంటిది మన భారతీయులకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటకు సంబంధించి అయితే మరింత ఆసక్తి కనబరుస్తారు.

అలా మన ఇండియన్ క్రికెట్ టీం కు మొట్టమొదటి సారి ప్రపంచ కప్ ను అందించిన సారధి కపిల్ దేవ్ జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న చిత్రం “83 ది ఫిల్మ్” బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కపిల్ పాత్ర పోషిస్తుండగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటుంది.

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిపోగా ఎడిటింగ్ మరియు డబ్బింగ్ టాకీ పార్ట్ కూడా పూర్తయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ఫైనల్ గా కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకునే ఫిమేల్ లీడ్ లో నటిస్తుండగా జీవా క్రికెటర్ శ్రీకాంత్ రోల్ లో కనిపించన్నారు.

Exit mobile version