మరో వైవిధ్యమైన కథలో గోపీచంద్ !

మరో వైవిధ్యమైన కథలో గోపీచంద్ !

Published on May 3, 2020 10:00 AM IST


యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ వరుస ప్లాప్ లతో గత కొన్నాళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరచడంతో గోపీచంద్ ప్రస్తుతం అయోమయంలో పడిపోయాడట. అయితే గోపీచంద్ తన పాత దర్శకుడు తేజతో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. తేజతో చేసిన ‘జయం, నిజం’ చిత్రాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

కాగా గోపీచంద్ కోసం తేజ ఓ వైవిధ్యమైన కథను రాశాడని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే ఆ స్క్రిప్ట్ కూడా గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే యేడాది వీరి ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది. ఇకపోతే గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో రానున్న సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు