నీహారిక పై వస్తోన్న వార్తలో వాస్తవం లేదట !

నీహారిక పై వస్తోన్న వార్తలో వాస్తవం లేదట !

Published on Apr 27, 2020 6:56 PM IST

మెగా వారసురాలు నీహారిక కొణిదెల మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో ఓ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో నిహారిక, రామ్ చరణ్ కు చెల్లెలు పాత్రలో నటించబోతుందని, నిహారిక కనిపించే సీన్స్ లో సిస్టర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు