అనుష్క ‘ఘాటీ’ పై లేటెస్ట్ అప్ డేట్ !

అనుష్క ‘ఘాటీ’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 3, 2025 5:00 PM IST

ghaatii

డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ‘ఘాటీ’లో మరో అతిథి పాత్రలో ఉందని, ఆ పాత్రలో ఓ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో పాత్రల పరిచయం కోసం ఓ హీరో వాయిస్ ఓవర్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు