అఖిల్ లెనిన్ పై లేటెస్ట్ అప్ డేట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ వేస్తాడని తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ అనంతరం అఖిల్ పై యాక్షన్ షెడ్యూల్ ను షూట్ చేస్తారట. ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందట. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version