బన్నీ – కొరటాల ప్రాజెక్ట్ పై నయా రూమర్స్.!

బన్నీ – కొరటాల ప్రాజెక్ట్ పై నయా రూమర్స్.!

Published on Jul 28, 2020 8:13 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీని తర్వాత కూడా బన్నీ మరిన్ని ప్రాజెక్టులకు కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే.

అందులో ఒకటి “ఐకాన్” సినిమా కాగా మరొకటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో ఓ సినిమా చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ జోరుగా కొనసాగుతుంది. అలాగే ఈ చిత్రం లైన్ కు సంబంధించి కూడా చాలానే వెర్షన్ లు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో బన్నీ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని అందుకు తగ్గట్టుగా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కొరటాల స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని వినికిడి. ప్రస్తుతానికి అయితే కొరటాల మెగాస్టార్ తో “ఆచార్య” బన్నీ “పుష్ప” ప్రాజెక్టులలో ఉన్నారు. మరి ఈ కాంబో నిజంగానే సెట్స్ పైకి వెళ్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు