ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి ఎనిమిది సీజన్లు సూపర్ సక్సెస్ అవ్వడం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం ‘సీజన్ 9’ పై ఉంది. అయితే, ఈ ‘సీజన్ 9’ మొదటి ఎలిమినేషన్‌కి టైమ్ అయింది. ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
శ్రష్టి వర్మ ‘బిగ్‌బాస్’లోకి వెళ్లేటప్పుడే.. తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో కొంతమంది బాక్సులు బద్దలు కొడుతూ కోటింగ్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. నిన్న ఎపిసోడ్లో కూడా నాగ్ అది కంటిన్యూ చేశారు. అటు ప్రియ, ఇటు మనీష్ ఇద్దరికి నాగార్జున క్లాస్ పీకారు. కెప్టెన్ మాట ఫైనల్ అంటూ క్లారిటీ ఇచ్చారు.