‘లెనిన్’లో ఐటమ్ సాంగ్ కోసం కసరత్తులు !

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన పెళ్లి కోసం ప్రస్తుతం సినిమాలకు వన్ మంత్ బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం అఖిల్ తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ వన్ మంత్ గ్యాప్ లో ఈ సాంగ్ ను షూట్ చెయ్యాలని, తర్వాత అఖిల్ షాట్స్ ను సాంగ్ లో యాడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు ఈ పాటను సింగర్ మంగ్లీ చేత పాడించనున్నారని టాక్.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Exit mobile version