మారుతి కథతో సాయి తేజ్ సినిమా !

maruthi

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీపుల్స్ మీడియా సంస్థలో రాబోతుంది. అయితే, ఒకపక్క రాజా సాబ్ సినిమా చేస్తున్న మారుతి, ఇదే బ్యానర్ లో తన కథతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ వంశీకృష్ణ. సాయి దుర్గా తేజ్ హీరో. డార్లింగ్ స్వామి మాటలు అందిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని తెలుస్తోంది. మొత్తానికి రాజాసాబ్ సినిమా తరువాత దర్శకుడు మారుతి చిన్న, మీడియం సినిమాలు చేసే అవకాశం తక్కువ వుంది.

అందువల్ల వేరే సినిమాలకు కథలు అందిస్తున్నారు. రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.

Exit mobile version