లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు చేస్తున్న విశ్వంభర కాకుండా మరో భారీ సినిమాల లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో అనీల్ రావిపూడితో ప్లాన్ చేసిన సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుండగా ఈ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది.
అయితే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా ఎవరు కనిపిస్తారు అని చాలా కాలం నుంచి ఓ టాక్ నడుస్తుంది. అయితే ఇపుడు నయనతార వరకు ఈ బజ్ రాగా ఆమెపై ఇపుడు మరో టాక్ వినిపిస్తుంది. నయన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కంటే ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షినీ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.