నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా వచ్చిన టీజర్ మంచి అంచనాలు పెంచింది. అయితే అఖండ 2 షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.
దీని ప్రకారం తర్వాత షెడ్యూల్ ప్రయాగరాజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ దాదాపు రెండు వారాలు అలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా దాదాపు షూటింగ్ మొత్తం ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుందట. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.