“కేజీయఫ్ చాప్టర్ 2″పై లేటెస్ట్ గాసిప్స్.!

“కేజీయఫ్ చాప్టర్ 2″పై లేటెస్ట్ గాసిప్స్.!

Published on Aug 31, 2020 12:00 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “కేజీయఫ్ చాప్టర్ 1” ఎన్ని ప్రకంపనలు రేపిందో తెలిసిందే. గత 2018 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుంది అని వచ్చిన తెలపడంతో దానిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ మళ్లీ షూటింగ్ మొదలు కానుండగా పలు అంశాలు మాత్రం ఈ చిత్రంపై ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రం కూడా ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ లో భాగంగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం ఓటిటి లో విడుదల కాదు అని వెండితెర మీదనే విడుదల అవుతుందని తెలుస్తుంది.

అలాగే కొన్ని రోజుల నుంచి మంచి వైరల్ అవుతున్న టాపిక్ పై కూడా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ రోల్ అనంత్ నాగ్ రోల్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ రీప్లేస్ కాదని పూర్తిగా ఈ చిత్రంలో పరిచయం కానుంది అని తెలిపారట. మొత్తానికి మాత్రం ఈ చిత్రం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు