‘లెనిన్’ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ !

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా తిరుమల ప్రాంతంలో భారీ సెట్ వేస్తున్నారు. తిరుమల కొండల నేపథ్యంలో ఈ సీక్వెన్స్ నడుస్తోందట. సినిమాలో నేటివిటీ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారట. మొత్తానికి ఈ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ అవుతుందట. ఏది ఏమైనా లెనిన్ కోసం అఖిల్ బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట.

Exit mobile version