‘మెగాస్టార్ – నయనతార’ల పై ఫ్యామిలీ సీన్స్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాషూటింగ్ స్టార్ట్ అయింది. నయనతార కూడా షూట్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం మెగాస్టార్ – నయనతార ల పై ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్స్ లో మెగాస్టార్ – నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు.

అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.
అయితే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Exit mobile version