స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారు.
ఇక ఈ సినిమాను డిసెంబర్ 15న సెట్స్‌పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద గారు’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానుంది. చిరు సినిమా షూట్లో తన భాగాన్ని పూర్తిచేసుకున్న వెంటనే వెంకటేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ కానున్నారట.
ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


