న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ని సృష్టించింది. కాగా తాజాగా ఈ సినిమాలో నాని పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో నాని పూర్తిగా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో కనిపిస్తాడని, గ్లింప్స్ లో చూసిన లుక్ కంటే రెండింతలు వైల్డ్ గా కనిపిస్తాడని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో నడుస్తాయని.. ముఖ్యంగా ఈ ఫ్లాష్ బ్యాక్ గొప్ప విజువల్ వండర్ గా ఉంటుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. ఈ సీక్వెన్స్ లో నానితో పాటు మిగిలిన నటీనటులు కూడా షూట్ లో జాయిన్ అవుతారట. అన్నట్టు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా నాని కెరీర్లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.