‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్!

‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్!

Published on Jun 5, 2025 11:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ రిలీజ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తుంది అనుకున్న ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతున్న సినిమాగా మారింది. అయితే ఈ సినిమాని ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇదే ఆఖరి డేట్ అనుకునే అభిమానులకి మళ్ళీ వాయిదా వార్తలు నిరాశ పరిచాయి. 3

మరి లేటెస్ట్ గా కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనేది సవాలుగా మారింది. అయితే మేకర్స్ ముందు ప్రస్తుతం జూన్ 27 అలాగే జూలై 4 డేట్స్ ఉన్నాయని వినిపిస్తుంది. ఈ రెండు డేట్స్ లో ఏదొక డేట్ కి సినిమా వచ్చే ఛాన్స్ ఉందట. మరి వీటిపై ఒక అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు