బాలయ్య సెన్సేషనల్ కాంబోపై లేటెస్ట్ బజ్.!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకు ఒక పవర్ ఫుల్ రోల్ పడితే దాని గర్జన బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అలా తాను చేసిన అతి తక్కువ మంది దర్శకులతోనే బాలయ్య సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. అయితే ఇప్పుడున్న జెనరేషన్ లో బాలయ్యతో సెన్సేషనల్ కాంబో అంటే అది పక్కా మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుయే అని అందరికీ తెలుసు.

కానీ కొన్నాళ్ళు వెనక్కి వెళ్తే బాలయ్య లోకి సిసలైన ఉగ్రరూపం చూపించిన దర్శకుడు మాత్రం బి గోపాల్. వీరిద్దరి కాంబో అంటే అప్పట్లో ఆల్ టైం రికార్డులు నమోదు కావాల్సిందే. కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉండనుంది అని కొన్నాళ్ల కితం టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. వీరి కాంబోలో తీయనున్న సినిమాకు బి గోపాల్ స్క్రిప్ట్ ను లాక్ చేశారట. అలాగే కథ కూడా బాలయ్యకు నచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

Exit mobile version