అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ డేట్ టాక్ పై మిక్స్డ్ రెస్పాన్స్

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రం “లెనిన్”. అఖిల్ నుంచి ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక ఫుల్ మీల్స్ పెట్టే దానిలా కనిపిస్తుంది అని చెప్పాలి. మరి ఇలా లెనిన్ చిత్రం షూటింగ్ శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఓ లేటెస్ట్ బజ్ సినిమా రిలీజ్ డేట్ పై ఇపుడు వినిపిస్తుంది.

దీని ప్రకారం లెనిన్ చిత్రం ఈ ఏడాది చివరిలోనే విడుదల అవుతున్నట్టుగా టాక్. ప్రస్తుతానికి అయితే ఈ రానున్న నవంబర్ 14కి అలా లాక్ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇలాంటి మాస్ సినిమాని ఏ దసరాకో దీపావళికో ఆశిస్తే మరీ నవంబర్ అని డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version