కన్ఫర్మ్: ఎన్టీఆర్ తోనే ఆ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. నాగవంశీ నుంచి క్లారిటీ

లేటెస్ట్ గా కొన్ని ఊహించని రూమర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని దానిని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో చేయనున్నారు అని రూమర్స్ గట్టిగా వినిపించాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఎట్టకేలకు ఒక బిగ్ క్లారిటీ వచ్చేసింది.

డైనమిక్ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నుంచి ఇప్పుడు ఒక ఊహించని హింట్ తో క్లారిటీ వచ్చేసింది. తన నుంచి ఎక్స్ ఖాతా నుంచి తన మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ గా కనిపించనున్నారు అని క్లారిటీ ఇచ్చేసారు. దీనితో పాటుగా కుమార స్వామి పై తెలుగులో ఒక శ్లోకం లాంటిది పెట్టడంతో మొత్తానికి ఒక సెన్సేషనల్ క్లారిటీ వచ్చేసింది అని చెప్పొచ్చు.

Exit mobile version