లేటెస్ట్: అవైటెడ్ ‘కాంతార 1’ ట్రైలర్ కి డేట్, టైం ఖరారు!

Kantara-Chapter-1

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి తానే దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార 1’ కూడా ఒకటి. కొన్నాళ్ల కితం వచ్చిన కాంతార ది లెజెండ్ కి ప్రీక్వెల్ గా వస్తున్నా ఈ సినిమా తాలూకా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఫైనల్ గా మేకర్స్ ఈ బిగ్ న్యూస్ ని లేటెస్ట్ గా రివీల్ చేశారు.

దీనితో కాంతార 1 తాలూకా థియేట్రికల్ ట్రైలర్ ని ఈ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ అనౌన్సమెంట్ ని ఇచ్చేసారు. దీనితో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈసారి మేకర్స్ ఎలాంటి మాయాజాలం చేస్తారో తెలియాలి అంటే ముందు ఈ ట్రైలర్ కోసం వెయిట్ చెయ్యాలి. ఇక ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈ అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version