డాక్టర్ మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మి పరిశ్రమ లో తనకంటూ ఒక పేరు ని సృష్టించుకుంది . బుల్లి తెరలో “లక్ష్మి టాక్ షో” మరియు “ప్రేమతో మీ లక్ష్మి ” కార్యక్రమాలతో జనం లో మంచి పేరుని సంపాదించుకున్న లక్ష్మి ప్రస్తుతం తెలుగు,తమిళ మరియు హిందీ భాషల లో చిత్ర నిర్మాణం లో బిజీ గా ఉంది. త్వరలో లక్ష్మి “లక్ ఉంటె లక్ష్మి” అనే కార్యక్రమాన్ని నిర్మించబోతున్నారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సాయి కుమార్ వ్యవహరించబోతున్నారు ఇందులో పాల్గొనే వాళ్ళు వస్తువల ధరలను సరిగ్గా అంచనా వేసి చెప్పాలి.