రియల్ ఫైట్స్ చేస్తున్న మంచు లక్ష్మి

ప్రతిభ ఉన్న నటిగా నిరూపించుకున్న మంచు లక్ష్మి ప్రసన్న, ఇప్పుడు ఫైట్స్ కూడా చేస్తుంది. ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమా కోసం ఈ ఫీట్స్ చేస్తున్న సమయంలో ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఆమె సోదరుడు మంచు మనోజ్ కుమార్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని, మనోజ్ తో కలిసి ట్విట్టర్లో తెలిపింది. ‘హలో ఫ్రెండ్స్, చివరికి లక్ష్మి అక్క ఫైట్స్ చేసింది. ఫైట్ మాస్టర్ గా తను నాకు ప్రియమైన శిష్యురాలు.’ అంటూ మనోజ్ ట్వీట్ చేసాడు. నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీక్షా సేథ్ మరియు పంచి బోరా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తుండగా బోబో శశి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version