ప్రమాదం నుండి సురక్షితంగా బయట పడిన లక్ష్మి మంచు

lakshmi-manchu6

యాక్టర్ లక్ష్మీ మంచుకి ఈ రోజు ఒక భయంకరమమైన సంఘటన జరిగింది. ఆమె మరొక నటుడితో కలిసి కానోయ్ కేరళలో గల ఫేమస్ అయిన అల్ ప్పుజా బ్యాక్ వాటర్ రైడ్ కు వెళ్ళడం జరిగింది. ఆ ఓడ పల్టీలు కొట్టడంతో తను నీటిలో పడిపోయింది. ఈ విషయాని గురించి లక్ష్మీ మాట్లాడుతూ నేను ఒక కిలోమిటర్ వరకు నీటిలో ఈదుకుంటూ సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాను. చివరికి ఒక బోటులో వచ్చి తనని కాపాడారని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘అల్ ప్పుజా సరస్సు లో కానోలో రైడ్ కు వెళ్ళినప్పుడు మా కానో బోల్తా పడింది. మేమంతా బోటులో నుండి నీటిలో పడిపోయాము. మా దగ్గర ఉన్నపడవ పాడై పోయింది. దానితో మేము ఒక కిలోమిటర్ వరకు స్విమ్ చేయవలసి వచ్చింది. మాకు ఈ వాటర్ లో ఏమి వున్నాయో కూడా తెలియదు. పాములు వుండవచ్చని అనుకున్నాము’ అని ట్వీట్ చేసింది.

లక్ష్మీ మంచు ప్రస్తుతం ‘బాస్మతి రైస్’ అనే ఇంగ్లీష్ సినిమాకి సైన్ చేసింది.

Exit mobile version