ముమైత్ ఖాన్ కి లక్ష్మి మంచు ప్రత్యేక బహుమతి ఇచ్చారు.”గుండెల్లో గోదారి” చిత్రంలో ఐటెం సాంగ్ కి నృత్యం చేస్తున్న ముమైత్ ఖాన్ కి లక్ష్మి మంచు ప్లేస్టేషన్3 ని బహుమతిగా ఇచ్చారు. ” లక్ష్మి మంచు దగ్గర నుండి అద్బుతమయిన బహుమతి లభించింది. ఇపుడు నా దగ్గర కొత్త ఫై ఎస్ 3 ఉంది. లక్ష్మి నువ్వు చాలా మంచి మనిషివి నీ చిత్రంలో నటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అని ట్విట్టర్ లో తెలిపారు. అలానే లక్ష్మి కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రస్తుతం లక్ష్మి మంచు తమిళనాడు లో మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “కదల” చిత్రీకరణలో పాల్గొంటున్నారు.