లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ కానున్న మహేష్ ‘1’ ఆడియో

1Nenokkadine
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1- నేనొక్కడినే’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం ఈ నెల 19న హైదరాబాద్లో గ్రాండ్ గా జరగనుంది. తాజా సమాచారం ప్రకారం బెంగుళూరు కి చెందిన ప్రముఖ ఆడియో లేబుల్ కంపెనీ లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయనున్నారు.

చాలా గ్రాండ్ గా చేయనున్న ఈ 1 ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని థియేటర్స్ లో కూడా ప్రదర్శించనున్నారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెటింగ్ లో 1 సినిమా సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్ర రైట్స్ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు భారీ మొత్తానికి కొనుక్కున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version