నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా ఆడియో రైట్స్ ని లహరి ఆడియో కంపెనీ వారు ఓ బంపర్ ప్రైజ్ కి సొంతం చేసుకున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ఆడియో మార్చి 7న ఘనంగా రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆడియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇది కాకుండా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడు.
బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.