రవిబాబు దర్శకత్వంలో అల్లరి నరేశ్ లడ్డూ బాబు గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మొదటిసారిగా నరేష్ ఊబకాయ పాత్రపోషించనున్నాడు. ఈ మధ్య విడుదలైన సినిమా పోస్టర్ కు మంచి స్పందన లభించింది. అందులో నరేష్ ను చాలా మందిగుర్తుపట్టలేకపోయారు
ఈరోజు ఈ సినిమా మొదటి ట్రైలర్ ను విడుదలచేశారు. పలు మార్లు ప్రేమలో పడి, పెళ్ళికి తపనపడే యువకుడి కధ ఇది. ఈ సినిమాలో ‘అవును’ హీరోయిన్ పూర్ణ ప్రధాననాయిక. భూమిక, కోట శ్రీనివాసరావు ముఖ్యపాత్రధారులు
రాజేంద్ర త్రిపురనేని నిర్మాత. చక్రి సంగీతదర్శకుడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది