కృష్ణాలో రానాకి రేటు పెరిగింది.

కృష్ణాలో రానాకి రేటు పెరిగింది.

Published on Oct 30, 2012 1:09 PM IST


ఈ సంవత్సరం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న సినిమాల్లో టాలీవుడ్ యంగ్ హంక్ రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కూడా ఒకటి. మల్టీ స్టారర్ సినిమాలు పూర్తిగా కనుమరుగైపోయిన సమయంలో వరుసగా రెండు విభిన్న కథాంశాలతో మల్టీ స్టారర్ సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కృష్ణా జిల్లా రైట్స్ సుమారు 72 లక్షలకు అమ్ముడు పోయాయి. ఇప్పటి వరకూ రానా నటించిన ఏ చిత్రానికి రాని రేట్ ఈ సినిమాకి వచ్చింది.

నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, పోసాని, మిలింద్ గుణాజి మరియు రఘు బాబు కీలక పాత్రలు పోషించారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. జాగర్లమూడి సాయి బాబు మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు