ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర శేఖర కమ్ముల ‘కుబేర’ మేనియా నడుస్తోంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ లభిస్తోంది. బాక్సాపీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లను రాబడుతూ ఈ సినిమా తన సత్తా చూపిస్తోంది. ఎమోషనల్ రైడ్‌గా వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
అయితే, ఈ సినిమాలో ధనుష్ చేసిన పర్ఫార్మెన్స్కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన యాక్టింగ్‌తో ‘కుబేర’ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు ఈ హీరో. అయితే, ఈ పాత్ర తొలుత ఓ తెలుగు స్టార్ హీరోకు వెళ్లిందని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను ఈ పాత్రలో నటింపజేయాలని దర్శకుడు శేఖర్ కమ్ముల భావించాడట. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీలో ఓ చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. దీంతో ‘కుబేర’ మూవీలో దేవా పాత్రలో విజయ్ను తీసుకోవాలని శేఖర్ కమ్ముల అనుకున్నాడట.
కానీ, బిచ్చగాడి పాత్రకు తాను సూట్ కానని విజయ్ దేవరకొండ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో ఇప్పుడు కుబేర లాంటి సాలిడ్ హిట్ మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ విజయ్ మిస్ చేసుకున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.