తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి వెర్సటైల్ స్టార్ హీరోస్ లో అందులోని ఇతర విభాగాల్లో కూడా మంచి టాలెంట్ కలిగిన అతి కొద్ది మందిలో హీరో, దర్శకుడు ధనుష్ కూడా ఒకరు. మరి ధనుష్ నుంచి తన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి.
అయితే తమిళ్ లో మాత్రమే తన దర్శకత్వంలో రాగ లేటెస్ట్ గా తన కుబేర ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలుగులో ఒకవేళ దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అనే మాటకి తాను వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. దీనితో ఆ సభాస్థలి అంతా మారుమోగింది.
మరి పవన్ కి ధనుష్ అభిమాని అని ఎప్పుడో చెప్పడం జరిగింది. అలాంటిది ఇపుడు తనకి పవన్ ని దర్శకత్వం వహించాలని ఉందని చెప్పడం ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేసింది. మరి నిజంగానే వీరి కలయికలో సినిమా పడితే ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. ఇక ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కిన కుబేర ఈ జూన్ 20న విడుదల కాబోతుంది.