‘బోణి’, ‘తీన్ మార్’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలా ద్వారా తెలుగు వారికి సుపరిచితురాలైన కృతి కర్బందా త్వరలోనే ‘ఒంగోలు గిత్త’ సినిమాతో ప్రేక్షకులముందుకు రానుంది. ఇప్పటి వరకూ కమర్షియల్ గా హిట్ అందుకోని కృతి ఈ సినిమాతో హిట్ అందుకుంటానని చాలా ధీమాగా ఉంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గురించి కృతి మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో రామ్ ఎనర్జీకి సమానంగా డాన్సులు వేయడం చాలా కష్టం అనిపించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకసారి నా కాలు పై బైక్ పడింది. ఆ నొప్పి కన్నా రామ్ తో డాన్స్ చేయడమే చాలా కష్టం అనిపించింది. అలాగే మిర్చి యార్డులో ఘాటుకి కళ్ళల్లో ముక్కుల్లో నీరు కారుతుంటే ఆ టైంలో నేను, రామ్ రొమాంటిక్ సీన్స్ చేసాం. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్ధం చేసుకోగాలరనుకుంటారని’ అంది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.