మళ్ళీ రిపీట్ అవుతున్న ‘వినాయకుడు’ కాంబినేషన్


గతంలో వచ్చిన ‘వినాయకుడు’ చిత్రం ద్వారా కృష్ణుడు మరియు సోనియా జంటకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. ఈ కాంబినేషన్ మళ్ళీ మిస్టర్ మన్మధ సినిమాతో రిపీట్ కానుంది. బెల్లం కొండ సత్యం దర్శకత్వంలో ఎం. సీతారామ రాజు మరియు జి. శ్రీ రాములు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిన్న హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పోకూరి సుబ్బారావు మరియు ఎం.ఎల్ కుమార్ చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి స్రవంతి రవి కిషోర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణుడు మాట్లాడుతూ ‘ ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో హీరో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు విలువ నిచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ అబ్బాయికి సిక్స్ పాక్ లేకపోయినా పరవాలేదు ఉండటానికి ఇల్లు, కారు, మంచి ఉద్యోగం మరియు బ్యాంకు బాలన్సు ఉంటే చాలు అనుకునే అమ్మాయి. ఈ ఇద్దరూ ఎలా కలిసారు అనేదే ఈ చిత్ర కథాంశమని’ ఆయన అన్నారు.

Exit mobile version