వాళ్ళ బలం అదే అంటున్న క్రియేటివ్ డైరెక్టర్

వాళ్ళ బలం అదే అంటున్న క్రియేటివ్ డైరెక్టర్

Published on Jul 21, 2013 8:58 PM IST

Krishna-Vamsi

కెరీర్ మొదటి నుంచి రొటీన్ కి భిన్నంగా సామాజిక దృక్పథంతో సినిమాలు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ టాలీవుడ్ లోని తన తోటి దర్శకుల బలం ఏమిటనేది చెప్పుకొచ్చాడు. ‘ఇప్పటి దర్శకులు సాంకేతికంగా చేలా బాగా సినిమాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాగే చంద్రశేఖర్ యేలేటి, క్రిష్, రాజమౌళి సినిమాలు బాగా ఇష్టం. వీరందరిదీ ఒక్కో స్టైల్ ముఖ్యంగా వారు ఎంచుకునే అంశాన్ని ఎంతో సూటిగా చెప్పడమే వాళ్ళ బలం’ అని తెలిపారు. అలాగే చిరజీవితో సినిమా చేయాలని ఉందని, తను ఇంకా వంద శాతం సంతృప్తి చెందే సినిమా తీయలేదని కూడా తెలిపారు. ప్రస్తుతం కృష్ణవంశీ నాని హీరోగా తీసిన ‘పైసా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు