గతవారం విడుదలైన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ మంచి విజయం అందుకోవడంతో ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీ నయనతార ఫుల్ హ్యాపీగా ఉంది. ఈరోజు ఆమె తన సంతోషాన్ని మరియు డైరెక్టర్ క్రిష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ” నటిగా నా నటనని పూర్తిగా నమ్మిన ఏకైక దర్శకుడు క్రిష్. డబ్బింగ్ చెప్పడానికి నేను ఇబ్బంది పడుతున్నప్పుడు క్రిష్ చేసిన సపోర్ట్ ని నేనెప్పుడూ మర్చిపోలేను. నా మాతృ భాష తెలుగు కాదు, నా వాయిస్ తో ఎంతో కష్టపడి డబ్బింగ్ చెప్పానని’ నయనతార అంది. ఆలాగే రానా గురించి చెబుతూ ‘ రానా పక్కా ప్రొఫెషనల్, డేర్ అండ్ డాషింగ్ కో స్టార్, ఇలాంటి కో స్టార్ తో నేనిప్పటి వరకూ పనిచేయలేదన్నారు’.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో ఫిల్మ్ నగర్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో రానా, క్రిష్, నయనతార, పోసాని కృష్ణ మురళి మరియు నిర్మాతలు హాజరయ్యారు.