ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమవుతున్నారు. ఇప్పుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది. గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ ని ఆ దర్శకుడు పరిచయం చేయనున్నాడు, ఈ డైరెక్టర్ లాంచ్ చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి కానీ చివరికి గతంలో ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో అటు ఆడియన్స్ ని ఇటు విమర్శకులను మెప్పించిన క్రిష్ కి ఆ అవకాశం దక్కింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని రెండు నెలల పాటు లండన్, స్విట్జర్ ల్యాండ్ లలో షూట్ చేసి ఆ తర్వాత మిగిలిన భాగాన్ని ముంబాయి, హైదరాబాద్ లలో షూట్ చేయనున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నాడు. మరికొన్ని వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.