త్వరలో విడుదల కానున్న ‘కొత్త జంట’ ఫస్ట్ లుక్

త్వరలో విడుదల కానున్న ‘కొత్త జంట’ ఫస్ట్ లుక్

Published on Dec 11, 2013 8:40 PM IST

kotha-janta
రాబోతున్న మారుతి కొత్త జంట ఫస్ట్ లుక్ కొత్త సంవత్సరం సంధర్బం గా విడుదల కానుంది. చివరిసారి గౌరవం లో కనపడిన అల్లు శిరీష్ ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుండగా, రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తుంది .
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం హైదరాబాద్ లో ఇటివలే షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్ర వర్గం ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతి ఈ చిత్రం తో అందరిని ఆశ్చర్యపరచబోతున్నాడు. చిరంజీవి “ఖైదీ నెం. 786” లొ ఎంతో ప్రాముఖ్యమైన ‘అటు అమలాపురం’ పాట ఈ చిత్రం లో రీమిక్స్ చేసారు. ఈ పాట అల్లు శిరీష్ మరియు మధురిమ బెనర్జీ ల పై ఇప్పటికే చిత్రీకరించారు .
గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు . ఈ చిత్రం చాలా స్వార్ధ పరులైన ఒక యువ జంట చుట్టు తిరిగుతుంది . “కొత్త జంట ” వచ్చే ఏడాది మొదట్లో విడుదల అవుతుంది .

తాజా వార్తలు