యువతను ఉద్దేశించి, కేవలం వారి జీవితలనే కధాలుగా తీసి కాస్త భూతునూ జోడించి హిట్లను కొడతాడు అని మారుతికి ఇండస్ట్రిలో ఒక పేరు వుంది. ఇప్పుడు ఒక డీసెంట్ సినిమా తీసి తనపై వచ్చిన ఆ ముద్రను చెరుపుకోవడానికి మారుతి ప్రయత్నిస్తున్నాడు
ప్రస్తుతం మారుతి అల్లు శిరీష్, రెజినా లను జంటగా పెట్టి ‘కొత్త జంట’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది ఒక క్లీన్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తయారుకావడానికి మారుతి తనవంతు కృషిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క సిగరెట్ తాగిన సన్నివేశంగానీ, భూతు జోకులు గానీ లేవట. తమస్వార్ధం కోసం బతికే ఇద్ధరు తమ తమ స్వార్ధాల కారణంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కున్నారనే కధను ఆసక్తికరంగా చిత్రీకరిస్తున్నారు
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. జె.బి సంగీత దర్శకుడు. మరిన్ని వివారాలకోసం మా సైట్ ను చూడండి