సినిమా నేపథ్యంలో కొరటాల వెబ్ సిరీస్ !

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారబోతున్న సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ కిరణ్ అనే నూతన దర్శకుడికి అవకాశం ఇస్తూ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు. పైగా ఈ సిరీస్ కి కొరటాలనే స్వయంగా స్క్రిప్ట్ ను రాస్తున్నాడు. సినిమా నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు మోసాలతో పాటు సినిమా పై ఉన్న ప్రేమ, నిజాయితీని కూడా ఎలివేట్ చేస్తూ కొరటాల స్క్రిప్ట్ రాసారట. అలాగే టినేజ్ లవ్ వల్ల లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందనే పాయింట్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి అలాగే ఈ సమాజంలోని అన్యాయాలను అరికట్టే విధానం పై ఓ కొత్త థాట్ తో కొరటాల శివ ఈ ఆచార్య సినిమాని తీస్తున్నాడట.

Exit mobile version