ఆ కుర్ర హీరోకి కోరటాల శివ ఛాన్స్ ఇచ్చారా ?

ఆ కుర్ర హీరోకి కోరటాల శివ ఛాన్స్ ఇచ్చారా ?

Published on Oct 14, 2020 12:19 AM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆయన చేసిన నాలుగు సినిమాలు నాలుగు బ్లాక్ బస్టర్లు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఇలాంటి స్టార్ దర్శకుడితో వర్క్ చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేం. అయితే ఒక కుట్ర్రా హీరోకి మాత్రం ఆ అవకాశం చాలా ఎర్లీగానే వచ్చేసిందని టాక్ వినబడుతోంది. ఆ హీరోనే నవీన్ పొలిశెట్టి.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా చేసిన మొదటి ప్రయత్నంలోనే మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఇతనికి కొరటాల అవకాశం ఇవ్వనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే కొరటాల ఒక వెబ్ సిరీస్ నిర్మించనున్నారని, ఆయన దర్శకత్వ శాఖలోని అసిస్టెంట్ ఒకరు దీన్నిడైరెక్ట్ చేస్తారని, అందులో ప్రధాన పాత్రదారునిగా నవీన్ పొలిశెట్టికి అవకాశం దక్కిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ అనే సినిమా చేస్తున్నారు. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు