ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకరు. వరుస విజయ చిత్రాలతో దూసుకెళ్తున్న ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ఇంకా లైన్ లో ఉండగానే స్టైలిష్ అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియన్ చిత్రంను కూడా అనౌన్స్ చేసేసారు. కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఆచార్య తర్వాత కొరటాల ఒక ఊహించని హీరోతో సినిమా చెయ్యనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇది మాత్రం ఒక ఊహించని ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మీడియం బడ్జెట్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుంది అన్నది చూడాలి. అయితే అది బన్నీ చేస్తున్న సినిమాల టైం ని బట్టే డిసైడ్ అవుతుంది ఏమో అన్నది ఆసక్తికరంగా మారింది.