ఆచార్యలో చిరు గర్జన ఓ రేంజ్ లో..!


మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం కొరటాల శివతో ప్రకటించగానే ఫ్యాన్స్ లో అంచనాలు పతాక స్థాయికి చేరాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ చిరుని ఏ రేంజ్ లో చూపించనున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో ఓ కీలక రోల్ లో చరణ్ నటించడం మరో విశేషం. కాగా ఆచార్యలో చిరు పాత్ర గురించి డైరెక్టర్ కొరటాల శివను అడిగితే అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

ఆచార్య లో చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ రోల్ ఆయన సిద్ధం చేశారట. ఆయన పాత్ర చాలా సీరియస్ గా ప్రత్యర్థులకు చెమటలు పట్టించేదిగా ఉంటుందట. ఇక చిరు కోసం ఆయన బలమైన డైలాగ్స్ రాశారట. సీరియస్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్ తో చిరు పలికే ఆ డైలాగ్స్ సింహం గర్జించినట్లు ఉంటాయట. ఇక ఈ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తి కాగా వీలైనంత త్వరగా వస్తాం అని చెప్పుకొచ్చారు.

Exit mobile version