పచ్చడితో నోరూరించిన నీహారిక కొణిదెల !

మెగా వారసురాలు నీహారిక కొణిదెల మొదటిసారి ఆవకాయ పచ్చడి చేసిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్ల నోరూరించారు. ఈ సందర్భంగా నిహారిక వీడియోతో పాటు పోస్ట్ చేస్తూ.. ‘ప్రసిద్ధ ఆవకాయ పచ్చడిని మొదటి సంవత్సరం తయారు చేశాను. కొంత ముద్ద పప్పుతో సిద్ధంగా ఉండండి’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో ఓ ప్రత్యేక అతిధి పాత్రలో నిహారిక కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిహారిక, రామ్ చరణ్ కు చెల్లెలు పాత్రలో నటించబోతుందట, నిహారిక కనిపించే సీన్స్ లో సిస్టర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

కాగా నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఆమె తమిళ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. కాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళుతున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది.

Exit mobile version