కోవిడ్ తో ప్రముఖ తమిళ నటుడు మృతి.!

ఈ ఏడాది వచ్చిన ఊహించని అతిధి మూలాన మొత్తం ప్రపంచమే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో తెలిసిందే. కేవలం ఆర్ధికంగా మాత్రమే కాకుండా ఈ కోవిడ్ వైరస్ వల్ల ప్రాణ నష్టం కూడా ఎంతో వాటిల్లింది.. అది మన చిత్ర పరిశ్రమను కూడా చాలా ప్రభావితం చేసింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు ఉన్నారు.

పోరాడుతున్న వారు ఉన్నారు. అయితే తమిళ ఇండస్ట్రీకు చెందిన ఒక ప్రముఖ సీనియర్ నటుడు ఈ కోవిడ్ ప్రభావం వలన మృతి చెందినట్టుగా నిర్ధారణ అయ్యింది. అక్కడి స్టార్ హీరో ధనుష్ నటించిన “విఐపి 2”, “రైల్” లాంటి చిత్రాలతో పాటుగా ఎన్నో చిత్రాల్లో నటించిన నటుడు ఫ్లోరెంట్ సి పేరేరియా ఈరోజు కరోనాతో పోరాటంలో తన తుది శ్వాస విడిచారు.

ఆయన కేవలం సినీ నటునిగా మాత్రమే కాకుండా అక్కడి ప్రముఖ టీవీ ఛానెల్ కళైగ్నర్ టీవీ ఛానెల్ సంస్థకు జనరల్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. ఆయన చనిపోయారు అని వార్త బయటకు రావడంతో కోలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version