విడుదలయిన కో అంటే కోటి ఆడియో

విడుదలయిన కో అంటే కోటి ఆడియో

Published on Dec 9, 2012 12:22 AM IST


శర్వానంద్ మరియు ప్రియ ఆనంద్ లు ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం ” కో అంటే కోటి” చిత్ర ఆడియో ఈరోజు హైటెక్స్ లో విడుదల చేశారు.రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి పలువురు నటులు,దర్శకులు మరియు నిర్మాతలు హాజరయ్యారు. ఎస్ గోపాల్ రెడ్డి, బి గోపాల్, స్రవంతి రవికిషోర్, శ్రీహరి, శివ బాలాజి, నవదీప్ సందీప్ కిషన్, దేవ కట్ట, శేఖర్ కమ్ముల మరియు కమల్ కామరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైరసీ ని అరికట్టడానికి ఈ చిత్ర బృందం సోషల్ నెట్ వర్క్ సైట్స్ లో పాటలను అధికారికంగా విడుదల చేశారు. అనిష్ కురువిల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ నిర్మించారు. శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించగా ఎరుకేల్ల రాకేశ్ మరియు నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు