‘కిష్కింధపురి’ ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్ ఫిక్స్.. ఎందులో చూడొచ్చంటే..?

‘కిష్కింధపురి’ ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్ ఫిక్స్.. ఎందులో చూడొచ్చంటే..?

Published on Oct 10, 2025 1:11 PM IST

టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన హారర్ జోనర్ చిత్రం ‘కిష్కింధపురి’ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాను కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అండ్ టైమ్ వచ్చేసింది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 లో అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు