‘కె-ర్యాంప్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటున్న కిరణ్ అబ్బవరం

‘కె-ర్యాంప్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటున్న కిరణ్ అబ్బవరం

Published on Jun 30, 2025 5:01 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘కె-ర్యాంప్’ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకుని చాలా సింపుల్ లుక్‌లో కనిపించాడు. ఇక ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి కొదువ లేదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా జెయిన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా రాజేష్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు