మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమే కింగ్డమ్. అయితే ఈ సినిమా కూడా అనేకసార్లు వాయిదా పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తోంది.
మేకర్స్ అయితే ఇప్పుడు నేరుగా కొత్త కంటెంట్ ని రెడీ చేశారట. సినిమా ట్రైలర్ కట్ నే ప్రస్తుతం లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనితోనే కింగ్డమ్ రిలీజ్ ఎప్పుడు అనేది కూడా అనౌన్స్ చేయనున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.